టాలీవుడ్ సహాయ దర్శకుడి బైక్ చోరీ!

హైదరాబాద్ లో బైక్ దొంగలు రెచ్చిపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పని చేస్తూ, అమీర్ పేటలో నివాసం ఉంటున్న అశోక్ కుమార్ అనే వ్యక్తి బైక్ ను, పద్మారావు నగర్ కు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఎం రఘు బైక్ ను చోరీ చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అశోక్ కుమార్, 15వ తేదీన తన బైక్ తో బోయిన్ పల్లి పరిధిలోని బాటా చౌరస్తా వద్దకు వెళ్లారు. అక్కడ తమ బండిని పార్క్ చేసి (ఏపీ 09 సీజే 9804) పని చూసుకుని వచ్చేసరికి దాన్ని దోచుకెళ్లారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఇక, రఘు... శివాజీ దేవాలయానికి వెళ్లి తన బైక్ ను పార్క్ చేసి, కాసేపటి తరువాత వచ్చి చూడగా, అది మాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులను విచారిస్తున్నారు.
Go Back to Shorts
Bike
Theft
Asst Director
Hyderabad
Police

More Telugu News